OTT Movies | సినిమా ప్రేమికులకు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్ ఎంటర్టైనర్లు, క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కథలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు ఇలా విభిన్న జానర్లతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మే 25 నుంచి మే 31 వరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ వారం ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న చిత్రం కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ‘కర’. దర్శకుడు విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మమితా బైజు కథానాయికగా నటించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ ధనుష్ నటనకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు లెజెండ్ శరవణన్ నటించిన ‘లీడర్’ కూడా ఈ వారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, ఆండ్రియా, శ్యామ్, లాల్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం మే 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
కమెడియన్ సత్య హీరోగా నటించిన తొలి ప్రధాన చిత్రం ‘జెట్లీ’ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో వెన్నెల కిశోర్, అజయ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో కొత్త ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది.
మే చివరి వారంలో ప్రైమ్ వీడియో పలు ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్‌లను విడుదల చేయనుంది:
యానిమల్ ఫార్మ్ – మే 26
డిజర్ట్ వారియర్ – మే 26
ఫ్యూజ్ – మే 26
మై బెస్ట్ ఫ్రెండ్స్ డెడ్ – మే 26
ఓవర్ యువర్ డెడ్ బాడీ – మే 26
టూ ప్రాసిక్యూటర్స్ – మే 26
టు వుమెన్ – మే 26
స్పైడర్ నోయర్ (సిరీస్) – మే 27
లీడర్ – మే 29
ది లాస్ట్ వి కింగ్ – మే 29
నెట్‌ఫ్లిక్స్ కూడా ఈసారి విభిన్న కంటెంట్‌తో వినోదానికి సిద్ధమైంది:
షెరిఫ్ లాబ్రాడార్ – మే 25
అన్‌టోల్డ్ యూకే: విన్ని జోన్స్ – మే 26
మై టు సెంట్స్ – మే 27
కర – మే 28
ఎమీ మార్టింజ్ – మే 28
మర్డర్ మైండ్ ఫుల్లీ – మే 28
ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 – మే 28
కలబాసస్ కాన్ఫిడెన్షియల్ – మే 29
రఫా – మే 29
బ్రెజిల్ 70 – మే 29
జియో హాట్‌స్టార్‌లో
జెట్లీ – మే 25
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ – మే 27
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ – మే 29
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు
సన్ నెక్స్ట్
ఫేసెస్ – మే 29
లయన్స్ గేట్ ప్లే
ద రేస్ – మే 29
యాపిల్ టీవీ ప్లస్
ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ – మే 29
స్టార్ సిటీ – మే 29
HBO మ్యాక్స్
ది మూమెంట్ – మే 29
ఈ వారంలో యాక్షన్ ప్రేమికుల నుంచి థ్రిల్లర్ అభిమానుల వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేక కంటెంట్ అందుబాటులో ఉంది. వీకెండ్‌ను ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ఓటీటీ లైనప్ మంచి ఎంపికగా మారనుంది.