హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట,ఇబ్రహీంపట్నం, అల్వాల్, ఎల్బీనగర్, ఉప్పల్, మోహిదీపట్నం ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎండ తీవ్రత, ఉక్కపోతకు గురవుతున్న నగరవాసులకు ఈ చిరుజల్లులు ఎంతో ఉపశమనాన్నిచ్చాయి.
అలాగే వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయం ప్రజలు చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించారు.