IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ లీగ్ దశలో అదరగొట్టిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్(IPL Play Offs) పోరుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఓసారి టైటిల్‌ను కొల్లగొట్టిన నాలుగు జట్లు రెండోసారి విజేతగా నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్.. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించిన ఈ నాలుగు జట్లు కీలకమైన నాకౌట్ దశలో గెలుపే లక్ష్యంగా ఆడనున్నాయి. మగళవారం నుంచి నాకౌట్ సమరం మొదలవ్వనుండగా.. ఆర్సీబీ, గుజరాత్, సన్‌రైజర్స్, రాజస్థాన్ బలాబలాలు ఏంటో చూద్దాం.
ఐపీఎల్ -19వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్రిల్లర్లతో రంజుగా సాగిన లీగ్ దశ ముగియడంతో ప్లే ఆఫ్స్ సందడికి తెరలేవనుంది. గెలిస్తే ముందుకు.. ఓడితే ఇంటికి సూత్రం వర్తించనుండగా టైటిల్‌పై కన్నేసిన నాలుగు జట్లు గెలుపు వ్యూహాల్లో మునిగిపోయాయి. ఒకరిద్దరిపై కాకుండా సమిష్టిగా రాణిస్తేనే రెండోసారి ఛాంపియన్ అయ్యే అవకాశం ఉన్నందున.. ఏ పొరపాటుకు తావివ్వొద్దిని ఆర్సీబీ, గుజరాత్, సన్‌రైజర్స్, రాజస్థాన్ భావిస్తున్నాయి.
Rajasthan Royals are the fourth and final team to qualify for the IPL 2026 play-offs ✅
Their win against Mumbai Indians means Punjab Kings have been eliminated, despite a seven-game unbeaten start to the season 😮#IPL2026 #Cricket pic.twitter.com/UyN3xJW8FO
— Wisden (@WisdenCricket) May 24, 2026
తొలి టైటిల్ కోసం 18 ఏళ్లు నిరీక్షించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రెండో ట్రోఫీని పట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా 19వ సీజన్లో అడుగు పెట్టిన ఆర్సీబీ.. టాపార్డర్ విధ్వంసం, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ విజృంభణతో 9 విజయాలతో టాప్‌లో నిలిచింది. ప్రతిసీజన్‌లో కుర్రాడిలా చెలరేగే విరాట్ కోహ్లీ(557 పరుగులు) ఈసారి పరుగుల వరద పారించగా.. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో బెంగళూరును నిలబెడుతున్నారు.

ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్ రాణించగా.. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(73, ముంబై ఇండియన్స్‌పై), టిమ్ డేవిడ్(70, చెన్నై సూపర్ కింగ్స్‌పై )లు ఒకట్రెండు మ్యాచుల్లో మెరిశారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ పవర్ ప్లేలో నిప్పులు చెరుగుతున్నాడు. 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందున్న భువి.. క్వాలిఫయర్ 1లో కీలకం కానున్నాడు. హేజిల్‌వుడ్ సైతం ప్రత్యర్థులను వణికిస్తుండగా.. రసిక్ దార్ సలాం సైతం వికెట్ల వేటతో యశ్ దయాల్ లేని లోటును భర్తీ చేయడం బెంగళూరుకు కలిసొచ్చింది.
The Orange Cap has a familiar home heading into the playoffs 👑
Will Sai Sudharsan hold on to it until the very end? 🤔🧢#TATAIPL | #KhelBindaas pic.twitter.com/IkYDIrrGXY
— IndianPremierLeague (@IPL) May 25, 2026
అరంగేట్రం సీజన్ 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐపీఎల్ ట్రోఫీని ఒడిసిపట్టిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) రెండో కప్‌ను తన్నుకుపోవాలనే కసితో ఉంది. ఈసారి కెప్టెన్ శుభ్‌మన్ గిల్(616 పరుగులు) జట్టును ముందుండి నడిపిస్తుండగా.. తమిళ తంబీ సాయి సుదర్శన్(638 పరుగులు) బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఇద్దరూ ఒకట్రెండు స్థానాల్లో ఉన్నారంటే ఏ స్థాయిలో చెలరేగుతున్నారో అర్థమవుతుంది.

అయితే.. మిడిలార్డర్లో బట్లర్ .. సుందర్ మాత్రమే రాణిస్తుండడం గుజరాత్‌ను కొంత కలవరపరుస్తోంది. నిరుడు డ్రగ్స్ తీసుకొని పునరావాస కేంద్రంలో గడిపిన పేసర్ కగిసో రబడ(24 వికెట్లు) ఈసారి బెంబేలెత్తిస్తున్నాడు. సిరాజ్ జతగా కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతున్నాడు. టెస్టు బౌలర్లైన ఈ ఇద్దరూ లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ గుజరాత్ గెలుపు గుర్రాలుగా అవతరించారు. ఆల్‌రౌండర్‌గా జేసన్ హోల్డర్ నూరుపాళ్లు న్యాయం చేస్తుండగా, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (19 వికెట్లు) మళ్లీ లయ అందుకోవడం గుజరాత్‌కు కొండంత బలం చేకూరింది.
The Purple Cap belongs to Bhuvneshwar Kumar at the end of the league stage 💜👑
Will he go all the way to win his third Purple Cap? 🤩 🧢#TATAIPL | #KhelBindaas | @BhuviOfficial pic.twitter.com/M5dOXmSR7p
— IndianPremierLeague (@IPL) May 25, 2026
గత మూడు సీజన్లలో టాపార్డర్‌నే నమ్ముకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hydearbad) ఈసారి బౌలర్ల ప్రదర్శనతో విజయాలు సాధిస్తోంది. సొంతగడ్డపై వరసగా ఐదు.. మొత్తంగా 9 విజయాలతో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీకి ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు విఫలమైనా కోలుకుంటోంది. అందుకు కారణం ఇషాన్ కిషన్(569 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో తుఫాన్ ఇన్నింగ్స్‌తో స్కోర్ బోర్డును ఉరికిస్తున్నారు.

ఇదివరకులా 300లకు పైగా స్ట్రయిక్ రేటుతో కాకుండా సమయోచితంగా ఆడుతున్న క్లాసెన్ 606 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. ఆఖర్లో సలీల్ అరోరా, నితీశ్ రెడ్డి, స్మరణ్, అనికేత్‌లు దంచికొట్టగల సమర్ధులే. బౌలింగ్ దళంలోని కుర్రాళ్లు ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. కెప్టెన్ కమిన్స్, ఇషాన్ మలింగలు ఓ చేయి వేస్తుండగా.. స్పిన్నర్ శివాంగ్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులను నియంత్రిస్తూ విజయాల్లో కీలకం అవుతున్నారు. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో ట్రోఫీని ముద్దాడిన సన్‌రైజర్స్.. కమిన్స్ సారథ్యంలో 2024లో ఫైనల్ చేరినా రన్నరప్‌గా సరిపెట్టుకుంది.
తొలి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్స్ బెర్తు పట్టేసింది. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ (583 పరుగులు, 37 బంతుల్లో శతకం) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను భయపెట్టింది రాజస్థాన్. ప్రపంచస్థాయి బౌలర్లు బుమ్రా, కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్‌లను సైతం అలవోకగా ఎదుర్కొన్నఈ చిచ్చరపిడుగు ఏకంగా 53 సిక్సర్లు బాదడం విశేషం. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దూకుడు.. ధ్రువ్ జురెల్, ఫెరీరా మెరుపులు తోడవ్వగా జైపూర్ ఫ్రాంచైజీ నాకౌట్ బరిలో నిలిచింది. చావోరేవో పోరులో జోఫ్రా ఆర్చర్ తానొక ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు.

వాంఖడేలో ముంబై ఇండియన్స్‌పై విలువై 32 పరుగులు.. ఆపై మూడు వికెట్లతో రాజస్థాన్‌ను ఎలిమినేటర్‌కు చేర్చిన ఈ స్పీడ్స్టర్తో సన్‌రైజర్స్ బ్యాటర్లకు ముప్పే. బ్రిజేశ్ శర్మ, స్పిన్నర్ యశ్ రాజ్ పంజాలు సైతం అద్భుతంగా రాణిస్తున్నారు. సీజన్ మధ్యలోనే రెండుసార్లు చేతులు మారిన రాజస్థాన్‌ను.. ఉక్కు దిగ్గజం లక్ష్మినివాస్ మిట్టల్(Laxminiwas Mittal) రూ.15,660 కోట్లకు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం క్వాలిఫయర్ 1, బుధవారం ఎలిమినేటర్… ఆపై క్వాలిఫయర్ 2ను దాటిన జట్లు మే 31న అహ్మదాబాద్‌లో జరుగనున్న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.