కొండల్లో దారి తప్పిన వ్యక్తి.. ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తలేదు.. కారణం ఏం చెప్పాడంటే
Lost Hiker Ignores Calls | భుజానికి ఒక బ్యాగు తగిలించుకొని కొండల్లో, కోనల్లో నడుస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేయడం హైకింగ్. చాలామంది ఔత్సాహికులు

Lost Hiker Ignores Calls | భుజానికి ఒక బ్యాగు తగిలించుకొని కొండల్లో, కోనల్లో నడుస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేయడం హైకింగ్. చాలామంది ఔత్సాహికులు కొండ ప్రాంతాలకు వెళ్లిన ప్రతిసారీ హైకింగ్‌కు వెళ్తుంటారు. ఒక్కోసారి ఇలా వెళ్లినప్పుడు దారి తప్పే ప్రమాదమూ ఉంది. ఇదిగో ఇలాగే ఒక వ్యక్తి దారి తప్పాడు.
విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది అతనికి వందల సార్లు ఫోన్లు చేశారు. మొబైల్ రింగ్ అవుతోంది కానీ ఎవరూ ఎత్తరు. సదరు వ్యక్తికి ఏమైందా అని ఒక బృందం వెళ్లి అడవి మొత్తం వెతికి అర్థరాత్రికి వట్టిచేతులతో వచ్చింది. ఆ మరుసటి రోజు ఉదయం తప్పిపోయిన వ్యక్తి తిరిగి తన హోటల్ చేరుకున్నాడు.
రాత్రంతా ఏమైపోయారని హోటల్ సిబ్బంది అడిగితే.. అడవిలో దారి తప్పి రాత్రంతా దారి వెతుక్కుంటూ ఉన్నానని చెప్పాడు. మరి రెస్క్యూ టీం ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు? అని అడిగితే ‘ఆ నంబర్ నాకు తెలియదు. తెలియని నంబర్ నుంచి వస్తే ఫోన్ ఎలా ఎత్తుతాను?’ అని ఎదరు ప్రశ్నించాడు.
ఈ సమాధానం విన్న హోటల్ సిబ్బంది, రెస్క్యూ టీం నోట మాటరాలేదు. ఈ ఘటన అమెరికాలోని కొలరాడోలో జరిగింది. మౌంట్ ఎల్బర్ట్పై హైకింగ్‌కు వెళ్లిన ఒక వ్యక్తి దారి తప్పాడు. ఉదయం వెళ్లిన వాడు రాత్రికి కూడా తిరిగి రాకపోవడంతో హోటల్ సిబ్బంది కంగారు పడి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.
వారు వచ్చి అర్థరాత్రి వరకూ అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు.ఎన్ని ఫోన్లు చేసి తప్పిపోయిన వ్యక్తి ఎత్తలేదు. ఆ మరుసటి రోజు ఉదయం హోటల్‌కు వచ్చి తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చేసరికే ఎత్తలేదని సమాధానం ఇచ్చాడు.
ఈ విషయం తెలసిన అధికారులు ఎప్పుడైనా ఇలా తప్పిపోయినప్పుడు దయచేసి ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చినా ఎత్తండి అంటూ వేడుకున్నారు. ‘మన కోసం ఎవరూ వెతకరులే అనే ఆలోచన వద్దు. దయచేసి ఫోన్ వస్తే ఎత్తండి‘ అని వాళ్లు చెప్పారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

