Winter Tour : చలికాలంలో టూర్ ఎంజాయ్ చేయాలంటే.. తెలంగాణలోనే ఉన్న ఈ ప్లేస్‌కు వెళ్లాల్సిందే
చలికాలంలో టూర్ ఎంజాయ్ చేయాలంటే | వచ్చేసింది.. గజగజా వణికే రోజు వచ్చాయి. నవంబర్ స్టార్ట్ అయిందంటే చాలు ఇక చలి
వచ్చేసింది.. గజగజా వణికే రోజు వచ్చాయి. నవంబర్ స్టార్ట్ అయిందంటే చాలు ఇక చలి వణికిస్తుంది. ఫిబ్రవరి వరకు చలిని భరించాల్సిందే. చాలామంది చలికాలంలో ఎక్కువగా టూర్స్‌కు వెళ్లరు. చలికాలంలో రాత్రిపూట ప్రయాణాలు అంటే వామ్మో అంటారు. కానీ.. చలికాలంలో టూర్‌ను ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లకు బెస్ట్ డెస్టినేషన్ ప్లేస్ ఒకటి ఉంది. అది ఎక్కడో లేదు. తెలంగాణలోనే ఉంది.

అవును.. హైదరాబాద్ నుంచి కేవలం 290 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టూరిస్ట్ ప్లేస్. ఇంతకీ ఏంటా ప్లేస్ అంటారా? జన్నారం. మంచిర్యాల జిల్లాలో ఉంది. కరీంనగర్ నుంచి కానీ.. నిర్మల్ నుంచి కానీ జన్నారానికి వెళ్లొచ్చు. నిర్మల్ నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడెం ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఏంటి జన్నారం స్పెషల్?
ఇంతకీ జన్నారం స్పెషాలిటీ ఏంటి? అక్కడ ఏం ఉంటాయి అంటారా? అదో పెద్ద అడవి. వైల్డ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. రోడ్డుకు ఇరువైపుల పెద్ద పెద్ద చెట్లు… జన్నారంలోకి వెల్కమ్ పలుకుతాయి. టేకు చెట్లు, మధ్య మధ్యలో సెలయేరులను చూసి మైమరిచిపోవాల్సిందే.
అక్కడ ఉండటానికి తెలంగాణ టూరిజం వాళ్లు ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్ కూడా ఉంటుంది. సో.. జన్నారం వెళ్లి రెండు మూడు రోజులు ఉండి ఎంజాయ్ చేయొచ్చు.
జన్నారంలోనే కవ్వాల్ వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ ఉంటుంది. అది పులులు తిరిగే ప్రాంతం. దాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం గుర్తించి వైల్డ్‌లైఫ్ సాంక్చువరీగా మార్చింది. ఉత్తర తెలంగాణలోనే ఇది ఓల్డ్ సాంక్చువరీ. ఇది వృక్ష, జంతుజాలానికి నెలవు. సాంక్చువరీ నుంచి గోదావరి, కడెం ప్రాజెక్టులకు సెలయేరుల ద్వారా నీళ్లు వెళ్తుంటాయి.

సఫారీ అనే కొత్త అడవిని కూడా అక్కడ ఇటీవల పునరుద్ధరించారు. ఓపెన్ టాప్ వెహికిల్స్ ద్వారా ఆ అడవిలోకి తీసుకెళ్తారు. ట్రిప్ కనీసం 1.5 గంటల పాటు ఉంటుంది. అడవిలో 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధి వరకు తీసుకెళ్తారు. ప్రైవేటు వాహనాల్లో సఫారీ ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉండదు. వాటిని జన్నారంలోనే పార్క్ చేసి.. అటవీ శాఖ ఏర్పాటు చేసే వాహనాల్లోనే వెళ్లాల్సి ఉంటుంది.
అలాగే.. జన్నారం ఫారెస్ట్ బయో డైవర్సిటీకి నెలవు. జింకలు, అడవి ఎద్దులు, చిరుతపులులు, పెద్ద జింకలు, నెమళ్లు, ఇతర జంతువులు, పక్షులు అడవిలో ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా జన్నారం అడవిని వీక్షించి.. సాయంత్రం పూట.. సఫారీ ప్రాంతాన్ని సందర్శిస్తే వచ్చే కిక్కే వేరప్పా. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌కు వెంటనే జన్నారం చెక్కేయండి. అద్భుతమైన అడవి అందాలను, జలపాతాలను వీక్షించి పరవశించిపోండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
Bhongir Fort | తెలంగాణలో ట్రెక్కింగ్‌కు కేరాఫ్ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?
పచ్చని అడవుల్లో పాల ధారలా ‘క్షీర జలపాతం’..
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

