జాబ్ కావాలి.. మెట్రో స్టేషన్ వద్ద రెజ్యూమ్‌తో నిరుద్యోగి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
జాబ్ కావాలి.. మెట్రో స్టేషన్ వద్ద రెజ్యూమ్‌తో నిరుద్యోగి | మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చదువు పూర్తి చేసి బయటికి వచ్చే వాళ్లలో అందరికీ ఉద్యోగాలు రావడం లేదు
మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చదువు పూర్తి చేసి బయటికి వచ్చే వాళ్లలో అందరికీ ఉద్యోగాలు రావడం లేదు. అందరికీ ఉద్యోగాలే కావాలంటే కంపెనీలు ఎవరు పెడతారు. నేటి యూత్.. ఎంట్రీప్రెన్యూర్షిప్ కంటే కూడా ఉద్యోగం చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తుండటంతో అందరికీ ఉద్యోగాలు రావడం గగనంగా మారింది.

అందుకో ఓ నిరుద్యోగి తనకు జాబ్ కావాలని ఏకంగా మెట్రో స్టేషన్ వద్ద రెజ్యూమ్ పట్టుకొని హల్చల్ చేశాడు. చివరకు ఉద్యోగం సంపాదించాలనే తన కలను సాధించుకున్నాడు. సరికొత్తగా ఉద్యోగ వేట చేసి చేతిలో ఆఫర్ లెటర్ అందుకున్నాడు. మూడు గంటల్లో ఇంటర్వ్యూ కాల్ రావడం.. కేవలం మూడు రోజుల్లో తను కోరుకున్న ఉద్యోగంలో చేరడం చకచకా జరిగిపోయాయి.
లండన్‌కు చెందిన హైదర్ మాలిక్‌కు 24 ఏళ్లు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డొమైన్లో డిగ్రీ పూర్తి చేశాడు. గత సంవత్సరమే డిగ్రీ పూర్తయినా కరోనా మహమ్మారి వల్ల ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. చాలా కంపెనీలలో ప్రయత్నించినప్పటికీ నిరాశే మిగిలింది.
దీంతో ఇక లాభం లేదనుకొని.. వెరైటీగా ఆలోచించాడు. వెంటనే లండన్‌లోని కనరీ వార్ఫ్ ట్యూబ్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాడు. ఒక చోట నిలబడి.. నాకు ఎంట్రీ లేవల్ కానీ గ్రాడ్యుయేట్ స్కీమ్ రోల్ కావాలి అంటూ పక్కన ఓ బోర్డు పెట్టి నిలబడ్డాడు. తన చదువు, ఇతర డిటెయిల్స్ అక్కడ రాశాడు. మరిన్ని వివరాల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ.. ఆ బోర్డ్ మీద ఓ క్యూఆర్ కోడ్‌ను కూడా సెట్ చేశాడు. అలాగే.. తనతో పాటు తెచ్చుకున్న రెజ్యూమ్‌లను మెట్రో ప్రయాణికులకు పంచాడు.
తను మెట్రో స్టేషన్‌కు వచ్చిన మూడు గంటల్లోనే ఇంటర్వ్యూకు రావాలంటూ ఓ కంపెనీ నుంచి పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ పూర్తవ్వగానే అదే కంపెనీలో మాలిక్‌కు ఉద్యోగం కూడా వచ్చింది. ఇంటర్వ్యూ పూర్తయి.. తను సెలెక్ట్ అవడానికి మూడు రోజులు పట్టింది. వెంటనే ఆ ఉద్యోగంలో చేరాడు మాలిక్.
అయితే.. తను మెట్రో స్టేషన్లో నిలబడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అతడికి తన ఇంటర్వ్యూ తర్వాత తెలిసింది. తనను సోషల్ మీడియాలో ఫేమస్ చేసి.. తనకు ఉద్యోగం వచ్చేలా చేసిన వాళ్లందరికీ ఈసందర్భంగా మాలిక్ కృతజ్ఞతలు తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పురిటి నొప్పులు వస్తున్నా.. సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ
Monkey Festival : అక్కడ కోతుల పండుగే స్పెషల్ అట్రాక్షన్.. ఎందుకు జరుపుతారో తెలుసా?
ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లు లేని దేశాలు ఉన్నాయని తెలుసా?
నచ్చిన ఫుడ్ తినడం కోసం 8000 రెస్టారెంట్లు తిరిగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
30 ఏళ్లపాటు నీటిలో ఉన్న గ్రామం.. ఇప్పుడు బయటపడింది!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును పగులగొట్టిన వైసీపీ..!
AP News | కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
Rahul Gandhi | నాతో చర్చకు వస్తే మోదీ దేశ ద్రోహి అని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

