ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మానవత్వం చూపించాలి. తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదుటివారి మీద మానవత్వం చూపిస్తారు. కానీ.. అది ఎప్పుడు బయటపడుతుందో పరిస్థితులే చెబుతాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి చివరి నిమిషంలో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇంకో 14 నిమిషాల్లో రెస్టారెంట్ మూతపడుతుందనగా.. ఆ వ్యక్తి ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేయడంతో పాటు ఓ నోట్‌ను కూడా రెస్టారెంట్‌కు పంపించాడు.
చివరి నిమిషంలో ఆర్డర్ చేస్తున్నందుకు సారీ. నాకు ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడే నిద్రలేచా. బాగా ఆకలి అవుతోంది. అందుకే వెంటనే ఆర్డర్ చేశా. ఒకవేళ మీరు నా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే రెస్టారెంట్ క్లోజ్ అయిందని నేను అర్థం చేసుకోగలను అంటూ నోట్ పంపించాడు కస్టమర్.
ఆ నోట్ చదివిన రెస్టారెంట్ సిబ్బంది ఆ కస్టమర్‌కు ఉచితంగా ఫుడ్‌ను పంపించడంతో పాటు వాళ్లు కూడా ఓ నోట్‌ను కస్టమర్ కోసం పంపించారు. మీ నోట్‌కు ధన్యవాదములు. లేట్‌గా ఆర్డర్ చేశారని టెన్షన్ పడకండి. మేము ఏం అనుకోం. మీరు ఆరోగ్యం కుదుటపడాలని ఆ దేవుడిని కోరుకుంటూ.. మీ కోసం ఈ బ్రెడ్‌ను ఉచితంగా పంపిస్తున్నాం.. అంటూ రెస్టారెంట్ సిబ్బంది అతడికి ఉచితంగా ఫుడ్‌ను డెలివరీ చేశారు.
తన ఆర్డర్‌తో పాటు.. గార్లిక్ బ్రెడ్‌ను ఉచితంగా పంపించడంతో.. ఆ కస్టమర్ సంతోషించి.. గూగుల్‌లో ఆ రెస్టారెంట్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఈ విషయం మొత్తాన్ని రెస్టారెంట్‌కు చెందిన ఓ ఉద్యోగి.. తన రెడిట్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. దీంతో లాస్ట్ మినట్ ఆర్డర్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ రెస్టారెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెస్టారెంట్ చూపించిన మానవత్వానికి సలామ్ కొడుతున్నారు.
A couple days ago someone ordered 14 mins before closing time and wrote a note to us. I wrote one back and gave them a free garlic bread and a couple hours ago while working, I found out they left a review about it :). Was pretty happy for the rest of the shift (Repost because forgot to blur name) from MadeMeSmile
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జాబ్ కావాలి.. మెట్రో స్టేషన్ వద్ద రెజ్యూమ్‌తో నిరుద్యోగి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
పురిటి నొప్పులు వస్తున్నా.. సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ
Monkey Festival : అక్కడ కోతుల పండుగే స్పెషల్ అట్రాక్షన్.. ఎందుకు జరుపుతారో తెలుసా?
ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లు లేని దేశాలు ఉన్నాయని తెలుసా?