ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి ట్విట్టర్లో పవర్ఫుల్ మెసేజ్‌ను షేర్ చేశారు. సాధారణంగా ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. పలు ఫన్నీ వీడియోలు, సందేశాత్మక వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ మోటివేషనల్ వీడియోను షేర్ చేశారు.
ఓ బుడ్డోడు గోడను ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్లే ఏరియాలో ఉండే వాల్‌ను ఎక్కేందుకు బుడ్డోడు ప్రయత్నించే వీడియో అది. ఆ బుడ్డోడు ముందు కొంచెం పైకి ఎక్కాక.. ఇంకా పైకి ఎక్కలేక కిందికి దిగుతాడు. మళ్లీ ఏమైందో కానీ.. మరోసారి ట్రై చేసి పూర్తిగా పైకి ఎక్కుతాడు.
ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్.. చాలామంది లక్ష్యాలు కూడా అసాధ్యం అన్నట్టుగానే అనిపిస్తాయి. కానీ.. ఒక్కసారి నువ్వు నీ లక్ష్యం కోసం అడుగు వేశాక నిన్ను ఎవ్వరూ ఆపలేరు.. అంటూ క్యాప్షన్ పెట్టారు.
నువ్వు అది చేయలేవు అని.. నీవల్ల కాదు అని నిన్ను అందరూ వెనక్కి నెట్టేస్తుంటారు. అవేమీ పట్టించుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు.. విజయం నీదే.. అని ఆ వీడియో కింద ఇంగ్లీష్‌లో వివరించారు. అవి చదివితే ఖచ్చితంగా ప్రతిఒక్కరు మోటివేట్ అవుతారు.
చాలారోజుల తర్వాత ఓ మంచి మోటివేషనల్ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.. థాంక్యూ సార్.. అంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This video is from a couple of years ago, but I don’t think it will ever be ‘dated.’ I like to put it on every now & then, especially when some personal or business goal is looking intimidating or impossible! All my fears vanish instantly… pic.twitter.com/9XtuyBVxwJ
— anand mahindra (@anandmahindra) November 8, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సలసలాకాగే నూనెలో చేయి పెట్టి ఫ్రై చికెన్ తయారీ.. షాక్ అవుతున్న నెటిజన్లు
పెట్ స్నేక్‌ను ముద్దాడిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Viral Video : ఓరియో బిస్కెట్లతో పకోడీ.. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే..!