0హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. ఎండలు ముదరలేదు. కానీ, విద్యుత్తు డి మాండ్ మాత్రం పెరుగుతున్నది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే డిమాండ్ ఇ ప్పుడే నమోదవుతున్నది. గత బుధ, గురువారాల్లో 16,818 మెగావాట్లుగా నమోదైన గ రిష్ఠ విద్యుత్తు డిమాండ్.. శుక్రవారం ఒక్కరోజే 16,955 మెగావాట్లకు చేరింది. నిరుడు ఇదే రోజున గరిష్ఠ డిమాండ్ 15,830 మెగావాట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కాలంలో నే గరిష్ఠ డిమాండ్ వెయ్యి మెగావాట్లకుపైగా పెరిగింది. మొత్తంగా ఈ నెలలోనే గరిష్ఠ వి ద్యుత్తు డిమాండ్ 17 వేల మెగావాట్లు దాటుతుందన్న అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి దినదిన గండంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం వినియోగం 300 మిలియన్ యూనిట్ల మార్కును దా టింది. శుక్రవారం రికార్డు స్థాయిలో 303 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగించింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. జనవరి మొదటి వారంలో విద్యుత్ వినియోగం 250 మిలియన్ యూనిట్లు మా త్రమే. ఇప్పుడు ఇది కేవలం 50 రోజుల వ్యవధిలోనే 50 మిలియన్ యూనిట్లు పెరిగింది. జనవరి 5న 250 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం.. జనవరి 8న 260 మి. యూనిట్లు దాటింది. 23న 273 మిలియన్ యూనిట్లకు, ఈ నెల 1న 264 మిలియన్ యూనిట్లకు చేరింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతున్న విద్యుత్తు వినియోగం.. శుక్రవారం 303 మిలియన్ యూనిట్లకు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీగా వినియోగిస్తున్న 300 మిలియన్ యూనిట్ల విద్యుత్తులో జెన్కో వాటా 98 మిలియన్ యూనిట్లలోపే ఉన్నది. జెన్కో ప్లాంట్ల నుంచి విద్యుత్తు సరఫరా రానురాను తగ్గుతున్నది. ఈ నెల 15న అత్యధికంగా 109 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అందించిన జెన్కో.. 11న 89 మిలియన్ యూనిట్లు, 10న 81 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్లాంట్ల నుంచి తీసుకునే విద్యుత్తుతోపాటు బహిరంగ మార్కెట్లో కొనుగోలు అమాంతంగా పెరుగుతున్నది. అలా శుక్రవారం 118, గురువారం 131 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బయటి నుంచి తీసుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్లాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి బుధవారం 124, మంగళవారం 102, సోమవారం 90 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేశారు. దీంతో రాబోయే రోజుల్లో విద్యుత్తు కొనుగోలు మరింత పెరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం యాసంగి కావడంతో నాట్లు, వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. నాట్లు పూర్తవడం, ఎండల తీవ్రత పెరుగడం భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావుల్లోని మోటర్లను వినియోగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో విద్యుత్తు వాడకం అధికమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి ప్రభావంతోనే విద్యుత్తు డిమాండ్ పెరిగినట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు. కానీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ విద్యుత్తు డిమాండ్, వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎండలు ముదిరినకొద్దీ విద్యుత్తు డిమాండ్, వినియోగం మరింత అధికమవుతుంది. దీంతో డిమాండ్, సరఫరా తీరుపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు.
