సలసలాకాగే నూనెలో చేయి పెట్టి ఫ్రై చికెన్ తయారీ.. షాక్ అవుతున్న నెటిజన్లు
సలసలాకాగే నూనెలో చేయి పెట్టి ఫ్రై చికెన్ తయారీ | దేనితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. నిప్పుతో అస్సలు పెట్టుకోవద్దంటారు పెద్దలు. ఎందుకంటే..
దేనితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. నిప్పుతో అస్సలు పెట్టుకోవద్దంటారు పెద్దలు. ఎందుకంటే.. నిప్పుకు ఈ ప్రపంచాన్నే కాల్చేసేంత శక్తి ఉంది. అందుకే చాలామంది మంట, వేడి జోలికి పోరు. ఏదైనా వస్తువు వేడిగా ఉంటే ముట్టుకోవడానికి భయపడతాం. మంట దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడతాం. కానీ.. ఈ వ్యక్తి మాత్రం ఏకంగా సలసలాకాగే నూనెలో చేయి పెట్టేశాడు. నూనెలో వేసిన ఫ్రై చికెన్‌ను గరిటె అవసరం లేకుండా చేయితోనే తీసేస్తున్నాడు.

జైపూర్‌లోని ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ అలీ చికెన్ సెంటర్లో పనిచేసే వ్యక్తి పెద్ద మూకుడలో వేడి వేడిగా ఉన్న నూనెలో చేయి పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వేడివేడి నూనెలో చేయి పెట్టి అందులో ఉన్న ఫ్రై చికెన్‌ను తీస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు అయితే నోరెళ్లబెడుతున్నారు.. షాక్ అవుతున్నారు. అసలు.. ఇది ఎలా సాధ్యం.. అంత వేడిగా ఉన్న నూనెలో చేయి పెడితే చేయి కాలకుండా ఎలా ఉంది.. అంటూ నెటిజన్లు తలపట్టుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెట్ స్నేక్‌ను ముద్దాడిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Viral Video : ఓరియో బిస్కెట్లతో పకోడీ.. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

