ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!

Detling | సెంచరీలు కొట్టే వయస్సు మాది.. బౌండరీలు దాటే మనస్సు మాది.. ఇలా పాడుకోవడానికి చాలా సరదాగా ఉంటుంది. కానీ రియల్ లైఫ్‌లో సెంచరీ కొట్టడం అంటే అంత సులువు కాదు.. ఇప్పుడు ఉన్న రోజుల్లో వందేండ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు.. ఆరవై ఏండ్లకు పైగా బతకడమే పెద్ద విషయం. ఎక్కడో ఒక చోట.. ఎవరో ఒకరిద్దరు మాత్రమే వందేండ్లు దాటి బతుకుతుంటారు. కానీ ఆ గ్రామంలో ఇది పెద్ద విషయమేమీ కాదు.. అక్కడ వందేండ్ల బర్త్ డేలు జరుపుకోవడం సర్వసాధారణం. మరి ఆ గ్రామమేంటి? ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం..

యూకేలో డెట్లింగ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఈ ఊరు ప్రత్యేకత ఏంటో తెలుసా ! ఎక్కువ వయసు ప్రజలు ఉన్న గ్రామంగా డెట్లింగ్ యూకేలో రికార్డుకెక్కింది. మిగతా ప్రజలతో పోలిస్తే ఈ ఊరి వాళ్ల సగటు వయసు 12 ఏండ్లు ఎక్కువగా ఉంటుంది. చాలామంది వందేండ్లకు పైగానే బతుకుతుంటారు. అందుకే వందేండ్ల బర్త్ డేలు చేసుకోవడం మాకు సర్వసాధారణమేనని డెట్లింగ్ గ్రామ ప్రజలు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలో ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి కారణం.. వాళ్లు పాటించే ఆరోగ్యకరమైన అలవాట్లేనట. ఈ గ్రామంలోని ప్రజలు ధూమపానాన్ని పూర్తిగా నిషేధించారు. బయటకు వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో కూడా వీళ్లు అసలు సిగరెట్లు తాగరు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటారు. మంచి నీళ్లూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అంతే కాదు కేవలం 800 మంది ఉండే ఈ గ్రామంలో వైద్య సేవల కోసం ఎనిమిది మంది డాక్టర్లు ఉన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ డెట్లింగ్ గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నారు. వీటన్నింటి వల్లనే డెట్లింగ్ గ్రామ ప్రజలు మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ రోజులు బతుకుతున్నారని చెబుతుంటారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
ఒకప్పుడు భిక్షాటన ఆ ఊళ్లో కులవృత్తి.. కానీ ఆ ఒక్క నిర్ణయంతో..
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

