Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి వారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో రూ. రెండున్నర కోట్లకు పైగా నగదు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
కొండకింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో చేపట్టిన ఈ లెక్కింపులో స్వామి వారికి నగదు రూపంలో రూ. 2,66,68,787, మిశ్రమ బంగారం 87 గ్రాములు, వెండి 3,300 గ్రాముల చొప్పున వచ్చినట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. లెక్కింపులో ఈవోతో పాటు ఆలయ ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ సిబ్బందితో పాటు సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి వారికి భారీగా విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Agriculture Diploma | అగ్రి డిప్లొమాలో మిగిలిన సీట్లకు ఆగస్టు 12న కౌన్సెలింగ్..
TGPSC | సెప్టెంబర్ 20 నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్