Harish Rao | హైదరాబాద్ : ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఇంటర్‌కు ముందు విద్యాసంవత్సం నుంచి వెనక్కి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అని కొత్త జీవోలో చెప్పారు. గత ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు అని పాత నిబంధన చెప్తోంది. ఈ ప్రభుత్వం ఏడేళ్లు తీసేసి నాలుగేళ్లు అంటోంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ ప్రకారం తెలంగాణ విద్యార్థులు ఇంటర్ రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే, లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్తే నాన్ లోకల్ అయిపోరా? మన తెలంగాణ బిడ్డలు వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఈ నిబంధన ప్రకారం వాళ్లు పీజీ సీట్లకు నాన్ లోకల్ అయిపోరా? తమిళనాడులో మాదిరి రూల్స్ ఫ్రేమ్స్ చేయండి. అక్కడ ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఆరు నుంచి పదివరకు స్థానికంగా చదువుకుని, తల్లిదండ్రులు స్థిర నివాసం కలిగి ఉండాలి. కర్నాటక, కేరళలకు వాటి నిబంధనలు ఉన్నాయి.
తెలంగాణకు కూడా సొంత రూల్స్ కావాలి. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి విధానం రూపొందిస్తే అన్ని విద్యాసంస్థలకు మార్గదర్శకత్వం అవుతుందని హరీశ్‌రావు సూచించారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు ఉన్నందువల్ల పార్లమెంటు చట్టం ప్రకారం మేము పాత పద్ధతి కొనసాగించాం.
పదేళ్ల కాలం ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగించడం ఏమిటి..? రాష్ట్రపతి పాత ఉత్తర్వులోని మొదటి పారాగ్రాఫ్‌ను యథాతథంగా పెట్టారు. మిగతా పారాగ్రాఫ్‌లు వదిలి పెట్టారు. మా చేతుల్లో ఉన్నది కనుక అపుడు ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అనే నిబంధన తెచ్చాము. ఇపుడు అడ్మిషన్లలో 95 శాతం స్థానికులకే ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ విషయంపై దృష్టి సారించడం లేదు. వెంటనే జీవో 33లో సవరణలు తేవాలి. ఈ అంశంపై అఖిలపక్షాన్ని పిలిస్తే సూచనలు ఇస్తాం.
కాంగ్రెస్ పాలన గాలిలో దీపంలా ఉంది. వైద్య విద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఇప్పటికైనా కమిటీ వేయాలి. జీవోకు సవరణ చేయాలని కోరుతున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Balka Suman | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది గాలి వార్త : బాల్క సుమన్
TG Rains | తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం