మోనాలిసా ప్రేమ వివాహం
నిరుడు మహా కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మోనాలిసా భోస్లే కేరళలో ప్రేమ వివాహం చేసుకుంది. కుంభమేళాలో పూసలమ్ముకుంటున్న ఈ బ్యూటీ వీడియో వైరల్ కావడంతో తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చి నటి, మోడల్‌గా మారింది.
- రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన జంట
తిరువనంతపురం: నిరుడు మహా కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మోనాలిసా భోస్లే కేరళలో ప్రేమ వివాహం చేసుకుంది. కుంభమేళాలో పూసలమ్ముకుంటున్న ఈ బ్యూటీ వీడియో వైరల్ కావడంతో తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చి నటి, మోడల్‌గా మారింది. ఇండోర్‌కు చెందిన మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ఖాన్ను బుధవారం అరుమనార్లోని శ్రీ నైనార్ దేవ ఆలయంలో వివాహం చేసుకుంది.
కేరళ మంత్రి వీ పవన్ కుట్టీ, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్, ఇతర రాజకీయ నేతలు, నగర ప్రముఖులు వారి వివాహానికి హాజరయ్యారు. వీరిద్దరికి ఏడాదిన్నర క్రితం ఫేస్బుక్లో పరిచయం అయ్యి తర్వాత ప్రేమగా మారింది. అయితే ఇరువురి మతాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల వారు వారి వివాహానికి అంగీకరించ లేదు. తాను చూపించిన వ్యక్తినే పెండ్లి చేసుకోవాలంటూ మోనాలిసా తండ్రి జై సింగ్ భోస్లే ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్న మోనాలిసా దంపతులు పెండ్లి అయిన తర్వాత తమకు రక్షణ కల్పించాలంటూ కేరళ పోలీసులను ఆశ్రయించారు. ఇది అసలైన కేరళ స్టోరీ అని, కేరళలోనే తాము సురక్షితంగా ఉంటామని ఆ జంట నమ్మిందని ఎంపీ ఎంఏ రహీమ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

