Akhil | కూతురు పుడుతుందని అనుకున్నారు, కానీ నేను పుట్టా .. నాగార్జునకు షాక్ ఇచ్చిన అఖిల్
Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, తమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, తమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో అఖిల్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
ఈ సందర్భంగా తన పుట్టుకకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన, సరదా సంఘటనను పంచుకుని అభిమానులను నవ్వుల్లో ముంచెత్తారు. అఖిల్ చెప్పిన వివరాల ప్రకారం, తాను అమ్మ అమల గర్భంలో ఉన్న సమయంలో అమెరికాలో స్కానింగ్ చేయించగా, అక్కడి వైద్యులు పొరపాటున కడుపులో ఉన్నది అమ్మాయి అని చెప్పారట. దీంతో ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారని, ముఖ్యంగా నాగార్జున కూతురు పుట్టబోతోందనే ఆనందంలో మునిగిపోయారని తెలిపారు. అంతేకాదు, పుట్టబోయే పాపకు ‘నిఖిత’ అనే పేరు కూడా ముందుగానే ఖరారు చేసి, ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు.అయితే డెలివరీ సమయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. డాక్టర్లు బాబును చేతిలో పెట్టడంతో నాగార్జున ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని అఖిల్ నవ్వుతూ గుర్తుచేశారు.
ఆ సంఘటనను తనదైన కామెడీ టైమింగ్తో వివరిస్తూ, “కూతురు వస్తుందని ఎదురుచూస్తుంటే… వీడేంటి ఇలా వేలాడేసుకుని వచ్చాడనుకున్నారని సరదాగా చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం అఖిల్ చెప్పిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ, నాగార్జున ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండి ఉంటాయో అంటూ ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఒకవైపు ‘లెనిన్’ విజయోత్సాహం, మరోవైపు అఖిల్ కామెడీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Amala
- Chiranjeevi
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

