Agriculture Diploma | హైదరాబాద్ : జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో మిగిలిపోయిన అగ్రి డిప్లొమా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి తెలిపారు. ఈ నెల 12వ తేదీన యూనివర్సిటీలోని ఎగ్జామినేషన్ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పాలిసెట్-2024లో ర్యాంకులు పొందిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామని, అర్హత పొందని వారికి రెండో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత ఫీజు రూ. 19,460(ప్రభుత్వ కాలేజీలు), రూ. 22,210(ప్రైవేటు కాలేజీలు) తీసుకొని కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | సెప్టెంబర్ 20 నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
Manne Krishank | రేవంత్ రెడ్డి ఫ్రాడ్ పనులు మానుకోవాలి.. మన్నె క్రిశాంక్ హెచ్చరిక
Balka Suman | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది గాలి వార్త : బాల్క సుమన్