Manne Krishank | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఫ్రాడ్ పనులు మానుకోవాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ దందాల కోసం అమెరికా వెళ్లాడు అని క్రిశాంక్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో రూ. 1000 కోట్లతో పెట్టుబడి పెడుతామన్న స్వచ్ బయో అనే కంపెనీ రేవంత్ రెడ్డి తమ్ముడిది. వీళ్ల బినామీ హర్ష పసునూరి అనే ఒక సాప్ట్ వేర్ ఉద్యోగితో ఎంఓయూపై సంతకం పెట్టించి, 15 రోజుల కింద పెట్టిన కంపెనీ నుండి రూ. 1000 కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చూపిస్తున్నారని క్రిశాంక్ తెలిపారు.
సీఎం స్థాయిలో ఉండి వేల కోట్ల ఒప్పందాల పేరిట తన సోదరులను సెటిల్ చేసేందుకు యత్నిస్తున్నాడు. ఒకరిద్దరు కాదు ఏకంగా 30 మంది అధికార బృందంతో అమెరికా వెళ్లారు. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఐటీ శాఖకు సంబంధించిన సెక్రటరీలు వెళ్లారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఫైనాన్స్, ఇండస్ట్రీస్, ఐటీ సెక్రటరీలు కూడా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఆఖరికి మీ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూడా కనబడుతున్నరు. ఓటుకు నోటు కేసులో మీతో పాటు ఉన్న ముద్దాయిలు కూడా కనబడుతున్నరు. 30 మందితో అధికార బృందం వెళ్లింది మీ తమ్ముళ్ల వ్యాపారం కోసమా..? తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తావనుకుంటే.. మీ సోదరుల కోసం అమెరికాకు పోయి 15 రోజుల క్రితం ఏర్పాటైన స్వచ్ఛ్ బయో కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతుందని ప్రకటించి, రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారని మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Balka Suman | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది గాలి వార్త : బాల్క సుమన్
TG Rains | తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం