ఆదిలాబాద్ : మొరం కోససం తీసిన గుంత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బంగారిగూడకు చెందిన పలువురు మహిళలు గురువారం ఆటోలో పత్తి ఏరడానికి బయలుదేరారు. కాగా, ప్రమాదవశాత్తు డంపింగ్ యార్డ్ వద్ద మొరం కోసం తవ్విన గుంతలో ఆటో పడిపోవడంతో సవిత అనే మహిళ మృతి(Woman dies) చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సవిత మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట