జగిత్యాల : జగిత్యాల జిల్లాలో(Jagityala district) విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు(Snake bite) గురై ఓ మహిళ మృతి చెందింది(Woman died). ఈ విషాదకర సంఘటన కథలాపూర్ మండలం తాండ్రల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పత్రి లక్ష్మి (31) అనే మహిళ మొక్కజొన్న పంట కోయడానికి వెళ్లగా కూలికి వెళ్లగా పాము కాటుకు గురైంది. వెంటనే గమనించిన స్థానికులు హాస్పిటల్‌కు తరలించే లోపే మృతి చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మి మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3