Kick 2 | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు సల్మాన్ ఖాన్ (Salman khan). సల్లూభాయ్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ రికార్డులు, వసూళ్ల గురించే అంతటా చర్చ నడుస్తుంది. ఈ స్టార్ యాక్టర్ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచింది కిక్. కమర్షియల్ టచ్‌తో ప్రేక్షకులు పక్కా వినోదాన్ని అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
చాలా రోజుల తర్వాత ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ Kick 2అనౌన్స్మెంట్ వార్త ఒకటి తెరపైకి వచ్చింది. సికిందర్ సెట్స్‌లో కిక్ 2 సినిమాను ప్రకటించాడు దర్శకనిర్మాత సాజిద్ నడియాద్వాలా. అంతేకాదు కిక్ 2కు సంబంధించి ఫొటోషూట్ కూడా షురూ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన ఫొటోలో బ్లాక్ బనియన్‌లో ఉన్న సల్లూ భాయ్ జేబులో చేతులు పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ సారి సల్మాన్ ఖాన్ డబుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తాజా స్టిల్ చెప్పకనే చెబుతోందంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో సమంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. సల్లూ భాయ్ మరోవైపు అట్లీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఇదే కాకుండా వరుణ్ ధవన్ నటిస్తోన్న బేబీజాన్లో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు అర్థమవుతోంది.
#Kick2 photoshoot Kickstarts with #Sikandar! #SajidNadiadwala clicked an amazing picture of @BeingSalmanKhan from the sets! @NGEMovies @WardaNadiadwala #sidk #siddharthkannan pic.twitter.com/SnKbFgj1xi
— Siddharth R Kannan (@sidkannan) October 4, 2024
The wait is over 🔥🔥🔥
The #Kick2 photoshoot starts with #SalmanKhan ‘s #Sikandar!
इतनी खुशी मुझे आज तक नहीं हुई 🥳😂🎉 pic.twitter.com/k6kzAHWwng— Sonu Singh Maurya (@sonusingh00143) October 4, 2024
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3