Vetrimaaran | క్రేజీ టాక్.. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కాంబో రిపీట్.. !
Vetrimaaran | కోలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం వెట్రిమారన్ మరోసారి మక్కళ్ సెల్వన్‌తో సినిమా చేయబోతున్నాడట. అవును ఇంతకీ ఈ ఇద్దరు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారనే దానిపై ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Vetrimaaran | కథను నమ్మి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేసే కోలీవుడ్ డైరెక్టర్లలో ఒకరు వెట్రిమారన్. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ శింబుతో చేస్తున్న అరసన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అరసన్ జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా వెట్రిమారన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయో తెలిసిందే. వెట్రిమారన్ డైరెక్షన్లో వచ్చిన విడుదల, విడుదల పార్ట్ 2 సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.
కోలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం వెట్రిమారన్ మరోసారి మక్కళ్ సెల్వన్‌తో సినిమా చేయబోతున్నాడట. అవును ఇంతకీ ఈ ఇద్దరు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారనే దానిపై ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. వెట్రిమారన్ ఇప్పటికే ధనుష్‌తో వడ చెన్నై 2 ను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఒకవేళ ఇదే నిజమైతే వెట్రిమారన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనేది చూడాలి.
వెట్రిమారన్ సినిమాలంటే బలమైన కథాంశం, మంచి సందేశాన్నందించే సహజత్వం ఉట్టిపడే పాత్రలుంటాయని తెలిసిందే. అయితే మరి వెట్రిమారన్ తన రొటీన్ ఫార్ములాకు భిన్నంగా ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతుండటం.. అది కూడా మక్కళ్ సెల్వన్‌తో చేస్తాడని వార్తలు రావడం మాత్రం మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తుంది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌పై రాబోయే రోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
Read Also :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

