వరంగల్ : గుండెపోటుకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వేగంగా కోలుకుంటున్నారు. ఈ మేరకు హనుమకొండలోని రోహిణి హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ రెడ్డి పెద్ది హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
హార్ట్ స్ట్రోక్తో హాస్పిటల్కు తీసుకురావడంతో చికిత్స మొదలు పెట్టామని తెలిపారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని సూచించారు.