Sunitha Rao | రాహుల్ గాంధీ నారీ న్యాయ్ నినాదం ఎక్కడ..? కాంగ్రెస్ పార్టీని నిలదీసిన సునీత రావు
Sunitha Rao | జాతీయ స్థాయిలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్' పేరుతో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసేందుకు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో మాత్రం అందుకుభిన్నమైన వాతావరణం నెలకొన్నదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అసహనం వ్యక్తం చేశారు.
Sunitha Rao | హైదరాబాద్ : జాతీయ స్థాయిలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్’ పేరుతో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసేందుకు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో మాత్రం అందుకుభిన్నమైన వాతావరణం నెలకొన్నదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్లో ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కార్పొరేషన్ పదవులు సహా వివిధ ప్రభుత్వ పదవుల్లో మహిళలకు సమానవాటా దక్కలేదన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. పార్టీలో గౌరవం దక్కడం లేదంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 241 కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు. అయినప్పటికీ తనకు ఓడిపోయే గోషామహాల్ అసెంబ్లీ సీటు ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వం అని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు ఓడిపోయిన వారికి కూడా పదవులు ఇచ్చారని సునీత రావు గుర్తు చేశారు. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిని మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి వస్తానని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షీ అన్నారని ఆమె తెలిపారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ.. పార్టీకి ద్రోహం చేయకుండా కష్టపడి పని చేశానని సునీత రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Gadala Srinivas Rao | మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ ఆమోదం..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

