Gadala Srinivas Rao | మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ ఆమోదం..
Gadala Srinivas Rao | మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు సోమవారం వెలుగులోకి వచ్చాయి.
Gadala Srinivas Rao | హైదరాబాద్ : మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు సోమవారం వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ ఆమోదానికి సంబంధించిన ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాజీ డీపీహెచ్ గడల శ్రీనివాసరావును ప్రభుత్వం జులై 27న బదిలీ చేసిన సంగతి తెలిసిందే. పబ్లిక్ హెల్త్ విభాగంలో జాయింట్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్న ఆయనను మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (ఏడీపీహెచ్వో)గా నియమించింది. మరో ముగ్గురు ఏడీపీహెచ్వోలను కూడా బదిలీ చేస్తూ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గత నెల 27న మహబూబాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా గడల శ్రీనివాస్ రావును ప్రభుత్వం నియమించింది. కానీ ఆయన లాంగ్ లీవ్లో ఉండడంతో జాయిన్ అవ్వలేదు. ఇన్ఛార్జి డీహెచ్ పోస్టు నుంచి తప్పుకున్నాక ఆయన లాంగ్ లీవ్లోనే ఉన్నారు. గడల శ్రీనివాసరావు వీఆర్ఎస్కు రెండుసార్లు దరఖాస్తు చేయగా, తాజాగా ఆయన వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

