Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్ మాని.. ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన ఆగమాగమైపోయిందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఆ జ్వరాలతో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. హాస్పిటల్స్‌లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. బెడ్లు దొరక్క చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. ప్రజ్వల్ అనే 8 నెలల బాలుడు విషజ్వరంతో చనిపోయాడు. ఆసిఫాబాద్ జిల్లా గండిపేట గ్రామంలో కాశీనాథ్(32), పూజ(12) అనే ఇద్దరు వ్యక్తులు విషజ్వరాలతో చనిపోయారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. వేలాది మంది చికెన్‌గున్యా, వైరల్ ఫీవర్స్, విషజ్వరాలతో బాధపడుతున్నారు. హాస్పిటల్స్‌లో మెడిసిన్స్ లేవు. పసికందులను కుక్కలు పీక్కుతింటున్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ విలవిలలాడిపోతున్నారు అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. గురుకులాలకు సంబంధించిన వార్త లేకుండా పేపర్లు రావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో సమస్యలు నిత్యకృత్యమయ్యాయి. మా హయాంలో ఏడాదికి ఒకసారి ఏదైనా జరిగితే ఈ కాంగ్రెసోళ్లు రాద్ధాంతం చేసేవారు. గురుకుల పిల్లలు అనారోగ్యానికి తీవ్ర అస్వస్థతకు గురవుతూ హాస్పిటల్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కారం మెతుకుల ఆహారాన్ని పిల్లలు తింటున్నారు. మొత్తానికి తెలంగాణలో పాలన పడకేసింది. మార్కులు, స్కోరింగ్‌లు, బ్రేకింగ్‌లు, గోబెల్స్ ప్రచారాలు, దుష్ప్రచారాల మీద దృష్టి పెట్టారు. పబ్లిసిటీ స్టంట్స్ మానండి.. పరిపాలన మీద దృష్టి పెంట్టండి అని కోరుతున్నాను. పరిపాలన మీద దృష్టి పెడితే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. రాష్ట్రంలో విషజ్వరాలు నమోదు కావు అని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ క్రెడిట్ కాదని గుండెల మీద చేయి వేసుకోని చెప్పమనండి.. మంత్రి తుమ్మలకు హరీశ్‌రావు సవాల్
KTR | దళిత వాడలో వారం రోజులుగా నో కరెంట్.. డిప్యూటీ సీఎం గారూ జర చూడండి : కేటీఆర్