హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల పనితీరు రోజురోజుకు దిగజారుతున్నాయి. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజల చావుకొచ్చినట్లయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటికి నిన్న నీళ్లు లేక నీలోఫర్ హాస్పిటల్లో ఆపరేషన్లు ఆగిపోగా తాజాగా.. వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో( KMC Super Specialty Hospital) తీవ్ర నీటి కొరత(Water shortage) నెలకొంది.
దేశాయిపేట ఫిల్టర్బెల్ట్లో మరమ్మతుల కారణంగా నీటిసరఫరా నిలిచిపోయింది. అయితే ముందస్తు సమాచారం ఉన్నా కూడా అధికారులు నీటిని నిల్వ చేయకపోవడంతో సమస్యలు తలెత్తాయి. నీటి కొరతతో దవాఖానలో డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెంటనే నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.