Group-3 Exam | గ్రూప్-3 హాల్టికెట్లు విడుదల.. 17, 18 తేదీల్లో పరీక్ష
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది.
హైదరాబాద్: గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు HTTPS://WWW.TSPSC.GOV.IN నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. నవంబర్ 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 18న పేపర్-3 పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 1,388 ఖాళీలు భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్ష విధానం..
ఈ టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అలాగే.. పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

