యాదాద్రి భువనగిరి : కార్తీక మాసం(Kaarthika masam) నేపథ్యంలో యాదగిరిగుట్టలో (Yadagirigutta) భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొండపైన గర్భాలయంలో పాంచనారసింహులతోపాటు శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా, స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.