Allu Arjun – Rashmika Mandanna | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు కూడా సమయం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వగా.. దేశవ్యాప్తంగా భారీ ఈవెంట్లను ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌కు అంతా మంచే జరగాలని కొరుకుంటూ అల్లు అర్జున్‌కి ఒక స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది.
ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇక రష్మిక బన్నీ వెండి వస్తువు గిప్ట్గా ఇచ్చింది. దీనితో పాటు స్పెషల్ నోట్ పెట్టింది. మనం ఎవరికైనా వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసొస్తుందని మా అమ్మ తరచుగా చెబుతుంది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్.. మీకు మరింత అదృష్టం తీసుకొస్తుందని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు అని రష్మిక సందేశం పంపింది. ఈ నోట్‌ను షేర్ చేస్తూ.. థాంక్యూ మై డియర్.. ఇప్పుడు మరెంతో అదృష్టం కావాలి అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.