జోగులాంబ గద్వాల : హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు(Volvo bus) ఆదివారం ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal )
ఎర్రవల్లి సమీపంలో కోదండపురం స్టేజి సమీపంలో లారీని వెనుక నుండి బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో సాయిశ్రీజ (27), అంజలి (20), చిన్నారులు ఫయిజా, హైజా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, హైవే 44 అంబులెన్స్ ద్వారా బాధితులను కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
K.A. Paul | ట్రంప్ పాల్గొన్న ఈవెంట్లో కాల్పులు.. అదే హోటల్లో బస చేసిన కేఏ పాల్
Washington Hilton Hotel: రోనాల్డ్ రీగన్‌ను షూట్ చేసింది ఆ హోటల్ వద్దే..
Trump | ట్రంప్‌పై హత్యాయత్నం..వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు