Washington Hilton Hotel: రోనాల్డ్ రీగన్‌ను షూట్ చేసింది ఆ హోటల్ వద్దే..
Washington Hilton Hotel: డోనాల్డ్ ట్రంప్‌పై వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో హత్యాయత్నం జరిగింది. అయితే ఇదే హోటల్ వద్దే 1981లో మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై కూడా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆయనకు బుల్లెట్లు దిగాయి. కానీ సర్జరీ చేసి ఆ బుల్లెట్లను తీశారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఇవాళ హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ హిల్టన్ హోటల్(Washington Hilton Hotel)లో వైట్‌హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్లో పాల్గొనేందుకు వెళ్లిన ట్రంప్ ఫ్యామిలీని ఓ సాయుధుడు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన దుండగుడిని అరెస్టు చేశారు. హిల్టన్ హోటల్‌కు.. హింక్లే హిల్టన్ అన్న పేరు కూడా ఉన్నది. 1981 మార్చి 30వ తేదీన ఈ హోటల్ వద్దే అప్పటి దేశాధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై హత్యాయత్నం జరిగింది. జాన్ హింక్లే జూనియర్ అనే వ్యక్తి ఆనాటి దేశాధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై కాల్పులు జరిపాడు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అతను రీగన్‌పై ఆరు రౌండ్లు ఫైర్ చేశాడు. డిన్నర్లో మాట్లాడి బయటకు వస్తున్న రీగన్‌పై షూట్ చేశారు.
ప్రెసిడెంట్ రీగన్కు చెందిన లిమోసిన్ కారు నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ బుల్లెట్లు రీగన్ ఛాతిలో దిగాయి. ఆ కాల్పుల ఘటనలో రీగన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ కూడా ఆ గాయపడ్డ బృందంలో ఉన్నాడు. ఆయనతో పాటు ఓ పోలీసు ఆఫీసర్, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కూడా గాయపడ్డారు. అయితే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. అధ్యక్షుడు రీగన్‌ను తమ కారులో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు సర్జరీ చేశారు. ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. కాల్పుల ఘటన జరిగిన ప్రదేశం నుంచి హింక్లేను కస్టడీలోకి తీసుకున్నారు.
శనివారం రాత్రి కూడా వాషింగ్టన్లో ఇలాంటి ప్రయత్నమే జరిగింది. ఓ ఆగంతకుడు ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వైట్‌హౌజ్ కరెస్పాండెంట్స్ డిన్నర్‌కు రిపోర్టర్లు హాజరవుతారు. బాల్రూమ్ వైపు దూసుకువచ్చిన ఆగంతకుడు సుమారు 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ట్రంప్, ఆయన సతీమణి మేలానియా.. ప్రధాన వేదికపై ఉన్నారు. కాల్పుల శబ్ధం వినబడగానే.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను చుట్టుముట్టేశారు. సురక్షితంగా మరో రూమ్‌కు తరలించారు. ఇక డిన్నర్ టేబుళ్ల వద్ద ఉన్న అతిథులు .. భయంతో ఆ టేబుళ్ల కింద నక్కారు.
సాయుధుడిని అడ్డుకున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడ్డారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. అనుమానిత సాయుధుడు కూడా కస్టడీలో ఉన్నాడు. మరో 30 రోజుల్లో మళ్లీ వైట్‌హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

