అమెరికా : అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై(US President Trump) హత్యాయత్నం కలకలం రేపింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో(White House Correspondents’ Dinner) దుండగుడు కాల్పులు జరిపాడు. సుమారు 5 నుంచి 8రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కాగా, ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో పోస్ట్ చేస్తూ దీనిని ‘ఒక అద్భుతమైన సాయంత్రం’ అని అభివర్ణించారు. సీక్రెట్ సర్వీస్, లా ఎన్ఫోర్స్మెంట్ వేగంగా, ధైర్యంగా అద్భుతంగా పనిచేశాయని ప్రశంచారు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కొనసాగాలని తాను కోరుకుంటున్నానని, అయితే తాను పూర్తిగా లా ఎన్ఫోర్స్మెంట్ మార్గదర్శకాలను పాటిస్తానన్నారు. ఈ ఘటనలో ట్రంప్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వెంట్లో పాల్గొన్న వందాలది మంది టేబుళ్ల కింద దాక్కొని ప్రాణాలను కాపాడుకున్నారు.