Telangana | హైదరాబాద్ : వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన 14 రాష్ట్రాలకు రూ. 5,858.60 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ. 416.80 కోట్లు విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1036 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్రవాటా నిధులు విడుదలయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రకు రూ. 1432 కోట్లు ఇచ్చింది కేంద్రం.
14 రాష్ట్రాల్లో అత్యధికంగా మహారాష్ట్రకే నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందంటే.. త్వరలోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు భారీగా నిధులు విడుదల చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ఇలా నిధుల వరద పారించి, గెలిచే ప్రయత్నం చేయడం ఆ పార్టీకి అలవాటై పోయింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరదలు, వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ వారు కోలుకోలేని పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేదు. పోని కేంద్రమైనా ఆదుకుంటుంది అనుకుంటే.. అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీలు ఉండి ఇంత తక్కువగా నిధులు విడుదల చేయిస్తారా..? అని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | వారి గూడును కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ భావోద్వేగం.. వీడియో
Musi River | రేవంత్ రెడ్డి.. ఇంత దారుణమా..! మూసీ బాధితులను తరిమేసేందుకు మరో ఎత్తుగడ..!!