Musi River | హైదరాబాద్ : మూసీ సుందరీకరణ పేరిట.. నది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న పేద ప్రజలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏ అర్ధరాత్రి తమపైకి బుల్డోజర్ దూసుకువస్తుందో అనే భయంతో నిద్రలేని రాత్రులు గడుపతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా మూసీ బాధితులను తరలిస్తూ.. వారి ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు.
అయితే చాలా ప్రాంతాల్లో చాలా మంది తమ నివాసాలను ఖాళీ చేయమని ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నారు. తాము చావనైనా చస్తాం కానీ ఇక్కడ్నుంచి కదలమని తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ సర్కార్ మరో ఎత్తుగడ వేసింది. దారుణమైన చర్యకు పూనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేంటంటే.. మూసీ బాధితులకు ఒక భయం పుట్టించేందుకు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమయాత్ సాగర్ గేట్లను ఎత్తేసింది. దీంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది.
మొన్నటి వరకు వానలు దంచికొట్టి.. వరదలు పోటెత్తి.. ఈ రెండు జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఆ సమయంలో ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఒకట్రెండు గేట్లు ఎత్తారు జలమండలి అధికారులు. కానీ ఇప్పుడేమో రెండు ప్రాజెక్టులకు కలిపి ఐదారు గేట్ల చొప్పున ఎత్తి.. దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసి.. అక్కడ్నుంచే తరిమేయాలని రేవంత్ దారుణాలకు పాల్పడుతున్నాడు. ఈ పరిణామాలపై మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు.
మూసీ బాధితులను ఇల్లు ఖాళీ చేయించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటిని విడుదల చేసిన అధికారులు pic.twitter.com/XhbtnctO2H
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2024
ఇవి కూడా చదవండి..
KTR | వారి గూడును కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ భావోద్వేగం.. వీడియో
Operation Musi | లక్షన్నర ఇండ్లకు మార్కింగ్.. సుందరీకరణ పేరుతో మూసీలో ముంచేందుకు రంగం సిద్ధం!