KTR | హైదరాబాద్ : మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల ఇండ్ల మీదికి రేవంత్ రెడ్డి సర్కార్ బుల్డోజర్లను పంపింది. సామాన్లు తీసుకునే వరకు కూడా ఆగకుండా.. పేదల ఇండ్లను ప్రభుత్వం నేలమట్టం చేసింది. కూల్చివేసిన ఇండ్ల వద్ద ఓ ఇద్దరు చిన్నారులు.. మట్టిపెల్లలతో మళ్లీ ఇల్లును నిర్మించుకుంటున్న దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తుంది. ఈ వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వారి గూడును కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు. ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెతుక్కుంటున్నారని కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మీ మంత్రులను వచ్చి చెప్పమనండి…వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని అని కేటీఆర్ పేర్కొన్నారు. మీరు వచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి….మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము…మీ బ్రతుకులు బాగుపడతాయని చెప్పండి. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారూ.. తెలంగాణలో మీ సర్కార్ చేపడుతున్న కూల్చివేతలపై ఓ కన్నేయండి అని కేటీఆర్ సూచించారు.
ముఖ్యమంత్రి,
వారి గూడుని కూల్చేసారు!
వారి కలలను చిదిమేసారు!ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు!
మీ మంత్రులను వచ్చి చెప్పమనండి…వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని!
మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి….మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము…మీ బ్రతుకులు… pic.twitter.com/o7B6xk9U7s
— KTR (@KTRBRS) October 1, 2024
ఇవి కూడా చదవండి..
Hyderabad | రెచ్చిపోయిన కాంగ్రెస్ గూండాలు.. కేటీఆర్ కారుపై దాడి!
KTR | కేటీఆర్ మూసీ బాధితుల పర్యటనకు విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన జనం