హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్( KTR )మూసీ బాధితుల(Musi victims) పర్యటనకు విశేష స్పందన వస్తున్నది. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం అంబర్‌పేట(Amberpet) నియోజకవర్గం, గోల్నాక డివిజన్లోని లంక (తులసి రామ్ నగర్) ప్రాంతంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి మీకు అండగా మేముంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, గోపీనాథ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్లోల్ల కార్తిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాగా, కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. మూసీ- హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపైనా దాడికి తెగబడ్డారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు.
ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ గూండాలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు. చివరకు బీఆర్ఎస్ శ్రేణులు వారిని తన్ని తరిమివేశారు. అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.
కేటీఆర్ మూసీ బాధితుల పర్యటనకు విశేష స్పందన
భారీగా తరలివచ్చిన మూసీ బాధితులు
అంబర్ పేట నియోజకవర్గం, గోల్నాక డివిజన్లోని లంక ( తులసి రామ్ నగర్) ప్రాంతంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి మీకు అండగా మేముంటామని భరోసా ఇచ్చిన BRS పార్టీ వర్కింగ్ KTR, మాజీ మంత్రి తలసాని… pic.twitter.com/4s3Yt7PK2n
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2024