RS Praveen Kumar | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ గూండాలు సృష్టిస్తున్న అరాచకాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వీధి రౌడీలకు చిరునామాగా మారిందని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన.. ప్రజాపాలనల లేదు.. ప్రతీకార పాలనల ఉందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటది.. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సేలా.. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది..? అని ప్రభుత్వాన్ని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా..? అని అడిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. రాజ్యంగబద్ధమైన తన విధులను నిర్వర్తించేందుకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నిన్నకూడా కాంగ్రెస్ గూండాలు తెలంగాణ భవన్పై దాడులకు పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు మాని.. పాలనపై దృష్టి సారించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
వీధి రౌడీలకు చిరునామా కాంగ్రేసు పార్టీ. మీది ప్రజా పాలన కాదు, ప్రతీకారపాలన.
త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటరు. శ్రీలంక రాజపక్షలా రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు పారదోలే రోజులు దగ్గర పడ్డాయి. https://t.co/WAh3bTvcC7— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 1, 2024
ఇవి కూడా చదవండి..
KTR | వారి గూడును కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ భావోద్వేగం.. వీడియో
KTR | కేటీఆర్ మూసీ బాధితుల పర్యటనకు విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన జనం