అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం(Alliance government) అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ(YCP) నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులుచేశారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. ముఖ్యమంగా పాత కేసులను తిరగదోడి అరెస్టు చేసి జైలుకు కూడా పంపారని పేర్కొన్నారు.
దాడులకు గురై నష్టపోయిన కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి వారిలో దైర్యం నింపుతానని అన్నారు. గుంటూరు జిల్లాలో ని పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తన వంతు శాయశక్తులా కృష్టి చేస్తానని వెల్లడించారు. ఈనెల 4న పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు ఆయన వివరించారు.