మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో(Godavari river) స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు(Youths drowned )గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన చెన్నూరులోని సుందరశాల వద్ద చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.