హైదరాబాద్ : పేదల సొంతింటి కలను నిజం చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ (Congress)అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అపసోపాలు పడుతున్నది. పూటకో మాట, రోజుకో ప్రకటనతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నది. అందుకు తాజా ఉదాహరణ ఇందిరమ్మ ఇండ్లు. రుణమాఫీలాగే ఇందిరమ్మ ఇండ్లలో( Indiramma houses) సైతం కొర్రీలు పెడుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నది.
ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇవ్వాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. సొంత స్థలం లేని వారికి స్థలం ఇచ్చి మరీ ఇల్లు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు మాట మారుస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు రాగా అందులో 30 లక్షల దరఖాస్తులకు రేషన్ కార్డులు లేవు. దీంతో లక్షాది మంది నిరుపేదలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.