హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో బీసీ గురుకుల విద్యార్థులు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆహారం సరిగా పనిచేయడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
చదువు సరిగా లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు. దీంతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు సర్దిచెబుతున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారు.