Charuhasan | విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) సోదరుడు, సీనియర్ నటుడు, దర్శకుడు, చారుహాసన్ (Charuhasan) ఆసుపత్రిలో చేరారు (hospitalised). ఈ విషయాన్ని ఆయన కుమార్తె, సినీ నటి సుహాసిని మణిరత్నం (Suhasini Mani Ratnam) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న తన తండ్రితో దిగిన ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు.
దీపావళికి ముందు రోజు తన తండ్రి అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. దీపావళి పండుగరోజున ఎమర్జెన్సీ వార్డులో గడిపినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన తండ్రి సర్జరీకి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సుహాసిని విడుదల చేసిన వీడియోలో చారుహాసన్ మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నానని తెలిపారు. ‘నేను బాగున్నాను. సర్జరీకి సిద్ధంగా ఉన్నా. మళ్లీ మిమ్మల్ని చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. చారుహాసన్ తన ఇంటి డాబాపై పడిపోయినట్లు తెలుస్తోంది.
కాగా, 93 ఏళ్ల చారుహాసన్ గత కొంత కాలంగా వయసురీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పుడు కోలుకొని ఇంటికి చేరారు. ఇప్పుడు మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. చారుహాసన్ తమిళంతోపాటు పలు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన ‘హర’ అనే తమిళ చిత్రంలో కనిపించారు.
Also Read..
Rajinikanth | విజయ్ దళపతి రాజకీయ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్
Gurukula Students | సమస్యలు పరిష్కరించండి.. నేషనల్ హైవేపై బైఠాయించిన గురుకుల విద్యార్థులు