వరద సాయంలోనూ వివక్షే.. కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పక్షపాత వైఖరిని ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎండగట్టారు. 2021-22 సంవత్సరానికి ఆయా రాష్ట్రాలకు కేటాయించిన వరద సాయం నిధుల జాబితాను ఎన్డీఆర్ఎఫ్ రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ఆ జాబితాలో తెలంగాణ పేరు లేకపోవడాన్ని కవిత ప్రస్తావించారు. దీంతో ఆ జాబితాను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేస్తూ.. బీజేపీ పక్షపాత వైఖరిపై మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలకు వరద సాయం అందించడంలోనూ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని కవిత నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ వరదల సమయంలో సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని పేర్కొన్నారు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపూరిత వైఖరితో మనసు కలచి చేస్తోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
2021-22 లో అనేక రాష్ట్రాలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు మాత్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకొన్నది. వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులివ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి గతంలోనే లేఖ రాశారు. కానీ ఇప్పటిదాకా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు.
The Centre never supported, the NDRF state-wise fund list was released and had no mention of any support to Telangana Govt during Hyderabad floods. It breaks my heart to see that the extent of Centre’s bias knows no bounds.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 7, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

