– వి. గగన్‌కుమార్, పటాన్చెరు
అది ఇల్లు కాదుకదా అని మీ ఉద్దేశం. కానీ, ఆ సినిమా ఆదాయం మీరు అనుభవిస్తున్నారు కదా! దాని బాగోగులు పరోక్షంగా మీరు చూసుకున్నట్లే కదా! ఎలాంటి వీధిపోటు అన్నది మీరు ప్రస్తావించలేదు. నిర్మాణం చేశాక దానికి వీధి శూలలు వచ్చినప్పుడు ఏదో కారణం చేత ఆ వీధిపోటు ఫలితం ఉంటుంది. దక్షిణ-నైరుతి వీధి పోటు కలిగి, వాయవ్యం వీధి శూల ఉన్న కొన్ని సినిమా హాళ్లల్లో.. సినిమా విడుదల సమయంలో చాలాచోట్ల తొక్కిసలాటలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. అంతేకాదు.. నైరుతి వీధిపోటు వల్ల వ్యాపారం దెబ్బతిని, ఆదాయం తగ్గి మూతపడ్డ సినిమా హాళ్లు చాలానే ఉన్నాయి. అవన్నీ మనిషితో అనుబంధం ఉన్నవే! కాబట్టి, అది వ్యాపార పరమైనదైనా, గృహ సంబంధమైనదైనా అన్నిటినీ శాస్త్రబద్ధంగా నియంత్రించాల్సిందే!
– బలిజ శ్రీకాంత్, కోదాడ
ఈశాన్యం, నైరుతి దిక్కుల్లో ఉన్న గదిలో మెట్లు, లిప్ట్ రాకూడదు. ఆ దిక్కులు ప్రాణాత్మకమైనవి. అందుకు తగిన స్థానాలు ఆగ్నేయం, వాయవ్యాలు. ఆ స్థానాల్లో లిఫ్ట్, మెట్లు వేసుకోవచ్చు. నిర్మాణం కూడా సవ్యంగా ఉంటుంది. లోపల కాకుండా బయట వేయాలనుకున్నా కూడా ఆ దిశలు అనుకూలంగానే ఉంటాయి.

ఇంట్లో లేదా ఆఫీసులో నైరుతి వ్యవహారానికి, ఈశాన్యం జీవన వైభవానికి కారకాలుగా వ్యవహరిస్తాయి. కాబట్టి.. వాటిని మెట్లు, లిఫ్ట్‌లతో నింపి నిర్వీర్యం చేయవద్దు. మీకు లిఫ్ట్ లోపల రావాలంటే దక్షిణం, పడమర దిక్కుల్లో కూడా పెట్టుకోవచ్చు. డూప్లెక్స్ భవనాలకు ఈశాన్యం వైపున్న మెట్లు ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చి పెడతాయి. జాగ్రత్తగా అన్నీ చూసుకొని వేసుకోండి.
– విజయ, జోగిపేట
ఉన్న స్థలంలో రెండు పోర్షన్లు అనుకొని.. దక్షిణ ద్వారంతో ఒకటి, ఉత్తర ద్వారంతో మరొకటి కట్టుకున్నారు. రెండు ఇండ్ల మధ్య సందు నిర్మాణం చేపట్టవద్దు. దానివల్ల ఆ రెండు పోర్షన్లూ బాగుండవు. దేనికది స్వతంత్రంగా ఉండేలా కట్టుకోవాలి. చిన్నది అయినా కూడా అనందంగా, ఆరోగ్యంగా ఉండేలా నిర్మించుకోవాలి.

మీరు చెప్పిన విధంగా కట్టడం వల్ల పడమర వీధి సవ్యంగా, మరొకటి అపసవ్యంగా తయారవుతాయి. అలాగే ఒకరికి ఉత్తరం ఖాళీ ఉండదు. మరొకరికి నైరుతి ఉండదు. దానివల్ల ఇద్దరికీ ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఒక్కరు మాత్రమే కింది భాగం మొత్తం వాడుకోవాలి. అప్పుడే దిశలన్నీ పూర్ణఫలాన్ని అందిస్తాయి. వెంటనే అలా చేయండి.
– రాజీవ్, పోచాన్‌పల్లి
దేవతా స్థానాలు, పిశాచ స్థానాలు అనేవి వేరువేరుగా ఉండవు. అన్ని కూడా శక్తి స్థానాలే. దేనిని ఎలా వాడుకోవాలో అది దానిపరంగా ఫలితాలనిస్తుంది. అన్నం వండేందుకు కావాల్సిన ఆ అగ్గే.. మన శరీరాన్ని కూడా కాల్చుతుంది. ఇంట్లో ఖాళీ స్థలం ఏ దిశలో ఎంత మేరకు వదలాలి అనే లెక్క ఉంటుంది.

దానికి ప్రమాణాలు కూడా ఉన్నాయి. మీ ఇంటి స్థలం ఎంత? అందులో ఇల్లు కట్టే విధానం. ఇంటి చుట్టు పక్కల ఎంత స్థలం వదులుతున్నారనేది మీ నిర్మాణాన్ని బట్టే ఉంటుంది. ప్రదక్షిణ లేకుండా ఏ ఇల్లు కూడా కట్టవద్దు. కనీసం దక్షిణంలో మనిషి నడిచి వెళ్లేంత ఖాళీ స్థలాన్ని వదులుకోవాలి. అప్పుడే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకున్నవారవుతారు. సన్నని సందులు విడిచి కట్టడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143