అన్ని రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఎమ్మెల్సీ ఎల్.రమణ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం మేరకు బీసీల రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టామని తెలిపారు. ఈ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీసీ బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్లపై మీ పార్టీల వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాలన్నారు.
ఆత్మహత్యల వల్ల సమస్యలు పరిష్కారం కావని బీసీలకు ఎల్.రమణ పిలుపునిచ్చారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని తెలిపారు.అ ప్పుడు బీసీ సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.
కేంద్రంలో కొత్త చట్టాలు, కొత్త బిల్లులు వస్తూనే ఉన్నాయని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీలపై ఎందుకు ఇంత వివక్ష అని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీలు రిజర్వేషన్లు సాధించారని.. వారికి చట్ట బద్ధత వచ్చినప్పుడు మనకి ఎందుకు రాదని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో BC లు అత్యధికంగా ఉన్నారు కదా అడిగారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు అత్యంత ఎక్కువ అవసరం ఉన్నటువంటి ప్రజానికానికి అవసరమైన డిమాండ్ పట్ల కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పై మా ఎంపీ ప్రవేట్ బిల్లు అన్ని పార్టీలకు చెంప పెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.