నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లాలో(Nagarkurnool district) పెద్దపులి(Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. అమ్రాబాద్ మండలం తిర్మాలాపూర్(Thirmalapur) గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనంలో వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ సెల్ఫోన్లో బంధించారు. ప్రయాణికులను చూసి పులి భయంతో చెట్లపొదల్లోకి వెళ్లినట్లు తెలిసింది. పులి సంచరించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, పెద్దపులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు.