Metro Station | మెట్రో స్టేషన్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఓ మెట్రో స్టేషన్లో (Metro Station) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పూణె: మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఓ మెట్రో స్టేషన్లో (Metro Station) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. గమనించిన మెట్రో అధికారులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.
ఐదు ఫైర్ ఇంజిన్లతో అక్కడి చేరుకున్న సిబ్బంది.. ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా, మెట్రో స్టేషన్లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ట్వీట్ చేశారు.
#WATCH | Maharashtra: At around 12 am, a foam material caught fire on the ground floor of Mandai Metro Station resulting in huge smoke in the station. The Pune fire brigade immediately rushed 5 fire tender vehicles and brought the fire under control within five minutes. No… pic.twitter.com/Oc1SC1wg3Q
— ANI (@ANI) October 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

