Inter Student | బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు.
హైదరాబాద్: హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె అనూష (16) బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా ఇంట్లో ఉంటున్న ఆమెను తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం కారులో తీసుకొచ్చి హాస్టల్ వద్ద దించి వచ్చిన కారులోనే తిరుగు పయణమయ్యారు.
అయితే వారు సగం దూరం కూడా వెళ్లకుండానే హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. అనూష స్పృహ కోల్పోయిందని నిర్వాహకులు చెప్పారు. దీంతో హుటాహుటిన వారు తిరుగు పయణమయ్యారు. అక్కడి వెళ్లే సరికి అనూష ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారు. అయితే వారు రాకముందే మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అనూష మృతిపై ఆమె పేరెంట్స్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

