Jammu And Kashmir | జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్బల్ (Ganderbal) జిల్లాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) అనుబంధ సంస్థ ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి లష్కరే ఉగ్ర సంస్థకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front)’ బాధ్యత వహించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని, అతడి ఆదేశానుసారం ప్రకారమే ఈ దాడులకు పాల్పడినట్లు సదరు కథనాలు నివేదిస్తున్నాయి. కాగా, టీఆర్ఎఫ్ కశ్మీర్లో చురుగ్గా ఉంది. గత సంవత్సర కాలంలో కశ్మీరీ పండిట్లు, సిక్కులు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడుతోంది.
కాగా, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికులే లక్ష్యంగా మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం గందేర్బల్ జిల్లా గగన్‌గిర్ వద్ద నిర్మాణరంగ కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వైద్యుడు, మరో ఆరుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం కూడా సోఫియాన్ జిల్లాలో ఓ బీహారీ కార్మికుడ్ని ఉగ్రవాదులు కాల్చిచంపారు. తాజా ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరాయుధలైన అమాయక పౌరుల్ని హత్య చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..
Brazil Presiden | బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు..
ISIS | ఐసిస్ అరాచకాలు.. పిల్లలను చంపి వండిపెట్టేవారు: ఫౌజియా అమీన్ సిడో
POMIS | సురక్షిత పెట్టుబడులకు.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం బెస్ట్!