POMIS | నెలనెలా ఆదాయాన్ని ఆశించేవారు, సురక్షిత పెట్టుబడులపట్ల ఆసక్తిగలవారు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం (పీవోఎంఐఎస్)ను పరిశీలించవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ఆకర్షణీయ వడ్డీరేటును అందిస్తున్నది. అక్టోబర్-డిసెంబర్‌కు 7.40 శాతం వడ్డీరేటు వస్తున్నది. ఇతర చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్ల మాదిరిగానే ఈ పీవోఎంఐ స్కీం వడ్డీరేటును కూడా మూడు నెలలకోసారి సవరిస్తారు.
ఇక ఈ పథకం కచ్చితమైన రాబడులను మదుపరులకు అందిస్తుంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ల కంటే అవి ఉత్తమంగానే ఉంటాయి. స్కీం మెచ్యూరిటీ కాలవ్యవధి ఐదేండ్లు. గరిష్ఠంగా రూ.9 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురితో కలిసి కూడా స్కీంలో చేరవచ్చు. అప్పుడు పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలు. ఇక 10 ఏండ్లు దాటిన పిల్లల పేరుతో కూడా స్కీంను తీసుకోవచ్చు.